Header Banner

కొత్తగా కారు కొనాలనుకునేవాళ్లకి గుడ్ న్యూస్! అతి తక్కువ ధరలో.. లాంగ్ డ్రైవ్ కి వెళ్లేందుకు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే!

  Fri Feb 21, 2025 19:03        Politics

2024లో అత్యధికంగా అమ్ముడైన వాహనం ఏంటో మీకు తెలుసా? టాటా మోటార్స్ నుంచి వచ్చిన సబ్ కాంపాక్ట్ SUV పంచ్. ఇప్పుడు పంచ్ లోనే ఎలక్ట్రిక్ వేరియంట్ కూడా వినియోగదారులను బాగా ఆకర్షిస్తోంది. పంచ్ ఈవీ రెండు బ్యాటరీ రకాల్లో అందుబాటులో ఉంది. 25 kWh వెర్షన్ 80 bhp, 315 Nm టార్క్‌ను అందిస్తూ 315 కి.మీ. పరిధిని ప్రయాణించగలదు. 35 kWh వెర్షన్ 120.69 bhp, 190 Nm టార్క్ తో  421 కి.మీ వరకు ప్రయాణించగలరు. ఈ కార్ల ధరలు రూ.9.99 లక్షల నుంచి రూ.14.29 లక్షల వరకు ఉన్నాయి. పెట్రోల్, డీజిల్, సిఎన్‌జి, ఎలక్ట్రిక్ వేరియంట్‌లలో లభించే ఏకైక వాహనంగా మార్కెట్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న టాటా నెక్సాన్.. అత్యధికంగా అమ్ముడవుతున్న కాంపాక్ట్ SUVలలో ఒకటి. ఈ ఎలక్ట్రిక్ వాహనం రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలను అందిస్తుంది. 30 kWh వెర్షన్ 325 కి.మీ. రేంజ్ వరకు ప్రయాణిస్తుంది. 45 kWh వేరియంట్ 489 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది. వీటి (ఎక్స్-షోరూమ్) ధరలు రూ.12.49 లక్షల నుంచి రూ.16.49 లక్షలు వరకు ఉన్నాయి. 

 

ఇది కూడా చదవండి: ఇకపై సురక్షిత ప్రయాణం!10 లక్షల లోపు 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో ఉత్తమ కార్లు!

 

ప్రస్తుతం మార్కెట్ లో తక్కువ ధరకు లభిస్తున్న ఎలక్ట్రిక్ కార్లలో మహీంద్రా XUV400 ఒకటి. ఇది మార్కెట్లో 34.5 kWh, 39.4 kWh బ్యాటరీ ఎంపికలలో అందుబాటులో ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 34.5 kWh వేరియంట్ 375 కి.మీ. 39.4 kWh వెర్షన్ 456 కి.మీ వరకు ప్రయాణించగలదు. వీటి (ఎక్స్-షోరూమ్) ధరలు రూ.15.49 లక్షలు నుంచి రూ.17.69 లక్షల వరకు ఉన్నాయి. టాటా కర్వ్ EV, ఒక స్టైలిష్ SUV. ఇది 2024లో మార్కెట్ లోకి వచ్చింది. దీని సొగసైన డిజైన్, ఆకట్టుకునే ఫీచర్ల కారణంగా మార్కెట్లో ఎక్కువగా అమ్ముడవుతోంది. ఇది 45 kWh, 55 kWh బ్యాటరీ వేరియంట్లలో లభిస్తుంది. 45 kWh వేరియంట్ 148 bhp, 215 Nm టార్క్‌ను అందిస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 502 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఎక్కువ శక్తి, తక్కువ రేంజ్ కోరుకునే వారికి 55 kWh వెర్షన్ బాగుంటుంది. ఇది 165 bhp, 215 Nmని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఏకంగా 585 కి.మీ. వరకు ప్రయాణించగలదు. మార్కెట్లో వీటి ధరలు రూ. రూ 17.49 లక్షలు నుంచి రూ 21.99 లక్షలు వరకు ఉన్నాయి. EV విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యుందాయ్ క్రెటా 42 kWh, 51.4 kWh బ్యాటరీ ట్రిమ్‌లలో అందుబాటులో ఉంది. 42 kWh వేరియంట్ 133 bhp, 200 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 390 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది. 51.4 kWh వెర్షన్ అయితే 169 bhp, 200 Nmని శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 473 కి.మీ. వరకు ప్రయాణిస్తుంది. వీటి ధరలు రూ.17.99 లక్షల నుంచి రూ.24.38 లక్షలు వరకు ఉన్నాయి.

 

ఇది కూడా చదవండి: వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. జగన్‌ సహా మరో 8మంది వైకాపా నేతలపై కేసు నమోదు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో 5 సంస్థలు...2 వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NewCar #Offer #MarutiSuzuki